దేవుని వాక్యంతో మీ రోజును ప్రారంభించండి. ఆయన ఆశీర్వాదాన్ని పొందండి

సంఖ్యాకాండము 6:24

"యెహోవా నిన్ను ఆశీర్వదించి, నిన్ను కాపాడునుగాక"

THE LORD BLESS YOU AND KEEP YOU

ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించడమే కాదు, మనలను కాపాడుతాడని ఆయన వాగ్దానం చేశాడు. ఇది మనకు ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది.

మన జీవితంలో ఎంతటి సమస్యలున్నా, కష్టాలున్నా, మనలను కాపాడే దేవుడు మన వెంట ఉన్నాడు. ఆయన ఆశీర్వాదం మన కుటుంబానికి, మన ఆరోగ్యానికి, మన ఆత్మకు సంపూర్ణ రక్షణ ఇస్తుంది. ఆమెన్

ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుడు మీను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఆయనను నమ్మండి, ఆయన మాటను గుర్తుంచుకోండి.

ప్రార్థన:
యెహోవా దేవా, నన్ను ఆశీర్వదించుము. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కాపాడుము. నాలో నీ కృపను నింపుము. నిత్యం నిన్ను వెంబడించేందుకు నన్ను సిద్ధం చేయుము.
ఆమెన్!

 

#TeluguBibleQuotes #ACAMinistry #BlessingOfTheLord #JesusLovesYou