కోలస్సయులకు 3:16
"క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి"
Let the Word of Christ dwell in you richly

ప్రియమైన దేవుని పిల్లలారా, మన హృదయంలో ఏమి నిలుచుంటుందో మన ఆలోచనలు, మాటలు, నిర్ణయాలు అన్ని వాటి ప్రకారమే జరుగుతాయి. అందుకే పౌలు అపోస్తలుడు ఈ వాక్యంలో మన హృదయంలో క్రీస్తు వాక్యము "సమృద్ధిగా" నివసించాలి అని చెబుతున్నాడు.

ఈ ప్రపంచంలో ఎన్నో మాటలు వినిపిస్తున్నా, దైవ వాక్యమే మనకు జీవము. అది శాంతిని ఇస్తుంది, మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది, మన ఆత్మను బలపరుస్తుంది.

ప్రార్థన:

ప్రభువా, నీ వాక్యము నా హృదయంలో నివసించేలా చెయ్యుము. నా ఆలోచనలు, నిర్ణయాలు నీ వాక్యానికి లోబడి ఉండునట్లు నన్ను మారుము. నాలో క్రీస్తు జీవించునట్లు నన్ను పటిష్టపరచుము.
ఆమేన్!

 

#ACAMinistry #WordOfChrist #DailyDevotion #BibleVerseOfTheDay