జీవిత ప్రయాణంలో ఎన్నో ప్రశ్నలు, భయాలు ఎదురైనప్పటికీ దేవుని వాగ్దానం మారదు. ఆయన మనతో పాటు నడిచే దేవుడు. ఒంటరితనంగా అనిపించే మార్గాల్లో కూడా ఆయన చేయి మన చేయిని పట్టుకుని ముందుకు నడిపిస్తుంది. మన బలహీనతల్లో ఆయన బలం కనిపిస్తుంది, మన భయాల్లో ఆయన సాంత్వన వెల్లివిరుస్తుంది. ఈ రోజు నీవు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా—నీవు ఒంటరివాడు కాడు. ప్రభువు నీతోనే ఉన్నాడు, నీ అడుగుల ప్రతి దశలోనూ ఆయన సన్నిధి నీకు మార్గదర్శకం.

#acaministry #acachurch #acacreations #illbe #withyou